![]() |
![]() |

బిగ్ బాస్ మరి గంటల్లో సందడి చేయబోతోంది. ఐతే ఇందులో ఎక్కువమంది సీరియల్ యాక్టర్స్ కనిపిస్తున్నారు. ఐతే సీరియల్ యాక్టర్స్ బిగ్ బాస్ లోకి రావడం వలన ఉండే అడ్వాంటేజ్ గురించి గత సీజన్ కామన్ మాన్ కంటెస్టెంట్ ఆదిరెడ్డి ఒక వీడియో చేసి తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో పోస్ట్ చేసాడు.
"బిగ్‌బాస్-7 వాళ్లేమో ఉల్టా పుల్టా అంటున్నారు.. కంటెస్టెంట్ల ముఖాలు చూస్తే అందరూ సీరియల్ యాక్టర్సేనా రొట్ట.. అనేసి చాలా మంది ఫీలవుతున్నారు. కానీ తెలుసుకోవాల్సిన నిజమేంటంటే.. బిగ్‌బాస్-2 విన్నర్ ఒక సీరియల్ యాక్టర్, బిగ్‌బాస్ సీజన్-5 విన్నర్ ఒక సీరియల్ యాక్టర్.. చాలా సీజన్లలో టాప్-5 వచ్చినవాళ్లంతా సీరియల్ యాక్టర్సే. సీరియల్ యాక్టర్స్ వెళ్లినంత మాత్రాన హౌస్ లో ల్యాగ్ చేస్తారని కాదు. సీరియల్ లో స్క్రిప్ట్ ఇస్తారు ఎదో చేయిస్తారు హౌస్ లో అలా ఉండదు. ఉదయం నుంచి రాత్రి వరకు చేసే పనులన్నీ చూపిస్తారు. వాటిని చూడడానికి ఆడియన్స్ కి ఇంటరెస్ట్ గా ఉంటుంది. సీరియల్ ఆర్టిస్టులు రావడం వలన ఫామిలీ ఆడియన్స్ కి వాళ్ళు బాగా కనెక్ట్ అవుతారు ఆటోమేటిక్ గా టిఆర్పి రేటింగ్ కూడా పెరుగుతుంది. సోషల్ మీడియా మొత్తం యాక్టివ్ గా ఉంటుంది. రివ్యూస్ బాగుంటాయి. మంచి ప్రోమోస్ రిలీజ్ అవుతాయి..కొత్త కంటెంట్ క్రియేట్ అవుతుంది . సీరియల్ యాక్టర్లు ఎక్కువమంది రావడం వల్ల ప్లస్ అవుతుంది కానీ మైనస్ అయితే కాదు.." అని చెప్పాడు.
ఆదిరెడ్డి చేసిన ఈ ఎనాలిసిస్ కి నెటిజన్స్ కూడా కామెంట్స్ చేశారు. " సీరియల్ యాక్టర్స్ ఎక్కువ మంది ఉంటే ఫ్రెండ్స్ ఐపోయి..శాక్రిఫైస్ లు చేసుకుని గేమ్ ని నెగ్లెక్ట్ చేస్తారు కదా..." అంటున్నారు. చూద్దాం మరి ఎంత మంది సీరియల్ యాక్టర్స్ ఉన్నారు...ఎంతమంది కామన్ మ్యాన్ ఉన్నారు. ఫైట్ ఎలా ఉండబోతోంది..అసలు హౌస్ లోకి ఎంతమంది ఎంట్రీ ఇస్తున్నారో చూడాలి.
![]() |
![]() |